For Money

Business News

బ్లడ్‌బాత్‌…

ఒకే ఒక్క రోజులో ఈస్థాయిలో వాల్‌స్ట్రీట్‌ పడటం ఇదే మొదటిసారి. సుంకాలు కాస్త అమెరికా మార్కెట్లకు గుదిబండగా మారాయి. అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎడాపెడా సుంకాలు వేయడంతో… దేశీయంగా ధరలు భారీగా పెరగనున్నాయి. దాదాపు అన్ని రకాల వస్తువుల దిగుమతులపై సుంకాలు వేయడంతో ద్రవ్యోల్బణం భారీగా పడటం ఖాయమనిపిస్తోంది. దీంతో మాంద్యం తప్పదని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఈ భయాలతోనే వాల్‌స్ట్రీట్‌లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం నుంచి అమెరికా ఫ్యూచర్స్‌ భారీ నష్టాల్లో ఉండగా, మార్కెట్లు ప్రారంభమయ్యాక… నష్టాలు మరింత పెరిగాయి. ఐటీ, టెక్ షేర్లలో వచ్చిన భారీ ఒత్తిడి కారణంగా నాస్‌డాక్‌ ఏకంగా 5 శాతంగా పడింది. డౌజోన్స్‌ పతనం మూడు శాతం దాటింది. ఒకదశలో ఈ సూచీ 1500 పాయింట్లు క్షీణించింది. ఇక ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా నాలుగు శాతం క్షీణించింది. మార్కెట్‌లో చిన్నా, చితక షేర్లను కొనేనాథుడు లేడు.