జీ టీవీలో ఇవాళ బ్లాక్ డీల్
జీ ఎంటర్టైన్మెంట్లో తనకు ఉన్న వాటాలో సగం వాటాను బ్లాక్‌డీల్ ద్వారా ఇన్వెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ విక్రయించనుంది. ఈ కంపెనీ ఫండ్‌కు 10.14 శాతం వాటా ఉంది. ఇందలో 5.32 శాతానికి సమానమైన 5.203 కోట్ల షేర్లను ఇన్వెస్కో విక్రయించనుంది. ఈ డీల్ ద్వారా కంపెనీకి రూ. 1323 కోట్లు రానున్నాయి. నిన్న బీఎస్ఈలో ఈ షేర్ రూ. 263.30 వద్ద ముగిసింది. అయితే ఈ ధరకన్నా తక్కువ ధరకు అంటే రూ. 250 ధరకు అమ్మవచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే ఇన్వెస్కోకు రూ. 1323 కోట్లు వస్తాయి. ఒకవేళ క్రితం ముగింపు వద్ద డీల్ విక్రయిస్తే రూ. 1395 కోట్లు వస్తాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ డీల్‌కు కంపెనీ షేర్ ఎలా స్పందిస్తుందో చూడాలి.