F &O: బేర్స్ విలవిల
చాలా రోజుల తరవాత బుల్ ఆపరేటర్స్ చెలరేగిపోయారు. నిఫ్టి 25000 దిగుకు వచ్చేసరికి.. ఇక మార్కెట్ పని అయిపోయిందని.. పుట్స్ కొన్ని చాలా మంది ఇన్వెస్టర్లు పూర్తిగా తమ పెట్టుబడి కోల్పోయారు. ముఖ్యంగా ఇవాళ్టితో ముగిసిన వీక్లీ డెరివేటివ్స్ ముగింపులో చాలా మంది బేర్ ఆపరేటర్లు అంటే పుట్స్ కొన్ని దాదాపు తమ పెట్టుబడి మొత్తం కోల్పోగా… బుల్ ఆపరేటర్స్ 4000 శాతం దాకా లాభాలు ఆర్జించారు. 25,250 వీక్లీ నిఫ్టి కాల్ ఇవాళ 60 పైసల నుంచి రూ. 174.10దాకా వెళ్ళింది. నిఫ్టి గరిష్ఠ స్థాయిలో క్లోజ్ కావడంతో ఈ కాంట్రాక్ట్ క్లోజింగ్‌లోకూడా 140 ప్రాంతంలో ఉండటం విశేషం. నిఫ్టి సరిగ్గా రెండు గంటలకు ప్రారంభమైన కొనుగోళ్ళకు షార్ట్ కవరింగ్ తోడు కావడంతో నిఫ్టి జెట్ స్పీడ్‌తో పెరిగింది. కేవలం గంటలన్నరలో 400 పాయింట్లకుపైగా పెరిగింది. ప్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ముఖ్యంగా ఆప్షన్స్‌లో ఇవాళ బుల్ ఆపరేట్లు వేల కోట్లు ఆర్జించారు. 25000పైన ఉన్న ప్రతి ఆప్షన్ కాంట్రాక్ట్ లాభాల్లో ముగిశాయి. ఇక నిఫ్టిపై వీక్లీ పుట్స్‌లో ట్రేడ్ చేసిన చాలా బేర్ ఆపరేటర్స్ చాలా వరకు 95 శాతం నుంచి వంద శాతం తమ పెట్టుబడి ఇవాళ కోల్పోయారు. ఈ నెలలో తొలివారం బేర్ ఆపరేటర్స్‌కు పీడకలగా మిగిలిపోయింది. మరి రేపటి నుంచి డెరివేటివ్స్ మార్కెట్ ఎలా ఉంటుందో చూడాలి.