8 శాతం పెరిగిన బిట్‌కాయిన్
షేర్ మార్కెట్‌తో పాటు క్రిప్టో కరెన్సీలలో కొనుగోళ్ళు పెరుగుతున్నాయి. ఈ వారం ఆరంభంలో 38,000 డాలర్లకు చేరిన బిట్ కాయిన్ ఇపుడు 8 శాతం లాభంతో ట్రేడవుతోంది. తాజా సమాచారం మేరకు బిట్ కాయిన్ 41,622 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎథిరీయమ్ కూడా 9 శాతం లాభపడి 2,740 డాలర్ల వద్ద ఉంది. బీఎన్బీ లాభాలు మాత్రం 5 శాతం లోపే ఉన్నాయి. ఇది 396.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక మీమ్ క్రిప్టో డోజికాయిన్ 2.5 శాతం పెరగ్గా, షీబా ఇను కూడా 4 శాతం లాభంతో ట్రేడవుతోంది.గత ఏడాది క్రిప్టో ఇన్వెస్టర్లకు విశేషంగా ఆకర్షించిన సొలానా కూడా ఇవాళ 5 శాతం పెరిగి 87.48 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.