చరిత్ర సృష్టించిన బిట్ కాయిన్
క్రిప్టోకరెన్సీ మార్కెట్ మళ్ళీ కళకళలాడుతోంది. అమెరికాలో తొలి బిట్‌కాయిన్ లింక్డ్ ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్) ఫండ్‌ను ఇవాళ ప్రారంభిచారు. ప్రొషేర్స్ బిట్‌కాయిన్ స్ట్రాటెజీ ఈటీఎఫ్ పేరుతో ఇవాళ ప్రారంభమైన ఈ ఈటీఎఫ్ ఓపెనింగ్‌లోనే 4 శాతం పైగా పెరిగింది. దీంతో బిట్ కాయిన్‌కు క్రేజ్ మరింత పెరిగింది. ఇవాళ 5.3 శాతం పెరిగి 66,174 డాలర్లకు చేరింది. క్రిప్టో కరెన్సీ చరిత్రలో ఓ స్థాయి ధర పలకడం ఇదే మొదటిసారి. గత ఏప్రిల్ 1న 64,778 డాలర్లను తాకిని బిట్ కాయిన్ తరవాత క్షీణించింది. ఇవాళ ఆ రికార్డును బ్రేక్ చేసి కొత్త రికార్డు నెలకొల్పింది.