లక్ష డాలర్లు దాటేసింది…

క్రిప్టో కరెన్సీలు అనూహ్య లాభాలు సాధిస్తోంది. ముఖ్యంగా ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరవాత క్రిప్టో మార్కెట్ జోరందుకుంది. అప్పటి నుంచి ముఖ్యంగా బిట్ కాయిన్ భారీ లాభాలు గడించింది. తాజాగా అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఛైర్మన్‌గా పాల్ అట్కిన్స్‌ను నియమించడంతో బిట్ కాయిన్ లక్ష డాలర్లను దాటింది. క్రిప్టో మార్కెట్‌కు ఎప్పటి నుంచో అట్కిన్స్ మద్దతు తెలుపుతున్నారు. తాజాగా అమెరికా ఫెడలర్ బ్యాంక్ గవర్నర్ జెరోమ్ పావెల్ కూడా క్రిప్టోను మరో బంగారంగా పేర్కొనడంతో ఈ మార్కెట్‌పై ఇన్వెస్టర్లలో మరింత విశ్వాసం పెరిగింది. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా క్రిప్టో మార్కెట్ సిద్ధమౌతోంది.