కుప్పకూలిన బిట్ కాయిన్
డాలర్ బలం క్రిప్టో కరెన్సీల పాలిట శాపంగా మారింది. బాండ్ ఈల్డ్స్‌తో పాటు డాలర్ పెరగడంతో ఇన్వెస్టర్లకు
క్రిప్టో కరెన్సీలపై మోజు తగ్గుతోంది. పైగా స్టాక్ మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు. క్రిప్టో కరెన్సీలలో రారాజు అయిన బిట్ కాయిన్ భారీగా క్షీణిస్తోంది. నిన్న బిట్ కాయిన్ విలువ 33,400 డాలర్లకు క్షీణించగా, ఇవాళ 30,831 డాలర్లకు క్షీణించింది. గతేడాది 67,566 డాలర్ల పలికి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన బిట్‌కాయిన్ 60 శాతం పైగా నష్టపోయింది. ఫలితంగా గతేడాది చివరిలో క్రిప్టో కరెన్సీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 3.15 లక్షల కోట్ల డాలర్లు ఉండగా, ఇపుడు 90 శాతానికి పైగా పతనమై 1.50 లక్షల కోట్ల డాలర్ల దిగువకు పడిపోయింది. బిట్ కాయిన్‌కు అత్యంత గట్టి మద్దతు స్థాయి 30,000 డాలర్లు. ఇపుడు 9.5 శాతం నష్టంతో 30,811 డాలర్ల వద్ద ఉంది. మరి ఇవాళ ట్రేడింగ్ కొనసాగే కొద్దీ ఇంకెంత పడుతుందో చూడాలి. బినాన్స్ కాయిన్ అయిన బీఎన్బీ ఇవాళ 13.6 శాతం క్షీణించింది.