భాసిన్… బ్లాక్‌బస్టర్ బెట్స్
మార్కెట్ ఇవాళ స్థిరంగా లేదా స్వల్ప నష్టంతో ప్రారంభం కానున్నాయి. జులై సిరీస్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. నిఫ్టి అనిశ్చితిలో ఉన్న సమయంలో రెండు ప్రధాన షేర్లను బ్లాక్ బస్టర్ షేర్లుగా సిఫారసు చేస్తున్నారు ఐఐఎఫ్‌ఎల్‌కు చెందిన ప్రముఖ మార్కెట్ విశ్లేషకుడు సంజీవ్ భాసిన్. హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్‌ను రూ. 580 టార్గెట్ కోసం రూ. 525 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయాలని ఆయ సిఫారసు చేస్తున్నారు. ప్రైవేట్ బీమా రంగంలో నంబర్ వన్ స్థానంలో ఉన్న ఈ కంపెనీ బాండ్ ఈల్డ్స్ పెరగడం చాలా ప్రధాన అనుకూల అంశమని ఆయన అన్నారు. ఈ కంపెనీ ట్రెజరీ బాండ్లలో భారీగానే పెట్టుబడి పెట్టింది. ఇక హెచ్డీఎఫ్సీ ఏఎంసీని కూడా కొనుగోలు చేయాలని భాసిన్ సిఫారసు చేశారు.ఈ షేర్‌ను రూ. 1850 టార్గెట్‌తో రూ. 1680 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయాలని సిఫారసు చేస్తున్నారు. ఈ షేర్లలో ఇటీవల వచ్చిన కరెక్షన్ వచ్చిందని… ప్రస్తుత ధర వద్ద ఈ షేరును కొనుగోలుకు మంచి అవకాశంగా భావించవచ్చని ఆయన అంటున్నారు.