గ్రోవర్‌తో మాకు సంబంధం లేదు
సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్‌పై ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ భారత్‌పే వేటువేసింది. పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో గ్రోవర్‌ను అన్ని హోదాల నుంచి తొలగించినట్టు కంపెనీ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. గ్రోవర్‌పై చట్టపరమైన చర్యలను తీసుకుంటామని, అతని కంపెనీ వాటాను కూడా స్వాధీనం చేసుకుంటామని ప్రకటించింది. పది రోజుల క్రితమే అష్నీర్ గ్రోవర్ భార్య మాధురి జైన్‌ను కూడా కంపెనీ తొలగించింది. మాధురి సంస్థ కంట్రోల్స్ హెడ్‌గా పనిచేసేవారు. నైకా షేర్ల కొనుగోలు వ్యవహారంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించారనే ఆరోపణల కింద కొద్దిరోజుల క్రితమే అష్నీర్ గ్రోవర్‌ను కంపెనీ బోర్డు మూడు నెలల సెలవుపై పంపించింది. ఇపుడు పూర్తిగా ఆయనకు ఉద్వాసన పలికింది.