BEMLలో మరింత వాటా అమ్మకం?
ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థల్లో మరింత వాటా విక్రయించడానికి రెడీ అవుతోంది. దీని కోసం ఇప్పటికే పలు కంపెనీల పేర్లను ఖరారు చేసింది. స్టాక్ మార్కెట్లో పలు రక్షణ రంగానికి చెందిన కంపెనీలు లిస్టయి ఉన్నాయి. ఇటీవలే ఓఎన్జీసీలో వాటా అమ్మిన మోడీ ప్రభుత్వం ఇపుడు భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML)లో మరింత వాటాను అమ్మేందుకు రెడీ అవుతోంది. ఈ కంపెనీ ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్టయింది. ఈ కంపెనీలో మరో 26 శాతంను అమ్మాలని కేంద్రం భావిస్తోంది. అయితే కంపెనీలో మరింత వాటా అమ్మే ముందు… కంపెనీకి చెందిన ఆస్తులను అమ్మాలని నిర్ణయించింది. ఆస్తుల అమ్మకం తరవాత వాటాల విక్రయం ఉంటుందని సమాచారం. ఇవాళ మార్కెట్లో BEML షేర్ రూ. 1804 వద్ద ట్రేడవుతోంది.