పొజిషనల్ ట్రేడ్… సెల్
ఇంట్రాడేలో నిఫ్టి పెరిగే అవకావముందని, అయితే పొజిషనల్ ట్రేడర్ మాత్రం సెల్ సైడ్ ఉండటం మంచిదని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని అన్నారు. సాధారణ బేర్ మార్కెట్లో షార్ట్ కవరింగ్ కారణంగా రావడానికి ముందు కన్సాలిడేషన్ ఉంటుందని… ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా కన్సాలిడేషన్ ప్రారంభం కాలేదని అన్నారు. స్వల్పకాలిక లాభాలు ఆశించేవారు డే ట్రేడింగ్ చేయొచ్చని… దీర్ఘకాలిక ఇన్వెస్టర్ మాత్రం పుట్స్ కొనడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు. పొజిషనల్ ట్రేడర్స్ మాత్రం లాంగ్ పొజిషన్ తీసుకోవడం రిస్క్ అని ఆయన అన్నారు. మార్కెట్ కుదురుకునే వరకు ఈ పొజిషన్స్ తీసుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు.