For Money

Business News

మీడియా హక్కుల ద్వారా రూ. 50,000 కోట్లు?

మరో రెండు ఐపీఎల్‌ టీమ్‌లు చేరడంతో ఈసారి మీడియా ప్రసార హక్కుల ద్వారా కనీసం రూ. 50,000 కోట్లు వస్తాయని బీసీసీఐ భావిస్తోంది. రెండు కొత్త టీమ్‌ల రాకతో మ్యాచ్‌ల సంఖ్య 60 నుంచి 74కు పెరిగింది. మీడియా హక్కుల కోసం బిడ్డర్ల నుంచి టెండర్లను బీసీసీఐ ఆహ్వానించింది. 2023 నుంచి 2027 వరకు అంటే అయిదేళ్ళ పాటు మీడియా ప్రసార హక్కులను బీసీసీఐ ఆఫర్‌ చేస్తోంది. తొలిసారిగా ‘ఈ బిడ్డింగ్‌’ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌లను లైవ్‌ స్ట్రీమ్‌ చేస్తోంది. ఈసారి జీ-సోని, రిలయన్స్‌ వయకామ్‌ 18 కూడా బరిలోకి దిగనున్నాయి. డిజిటల్‌ స్పేస్‌ కోసం డిస్నీ హాట్‌ స్టార్‌తో పాటు అమెజాన్‌ ప్రైమ్‌, యూట్యూబ్‌, మెటా కూడా బిడ్‌ చేయనుందని తెలుస్తోంది. టెండర్‌ ఫామ్‌ కావాలనుకునేవారు రూ. 25 లక్షల నాన్‌ రీఫండ్‌ ఫీజు కట్టాల్సి ఉంటుంది. మే 10 వరకు టెండర్‌ పత్రాలు ఇస్తారు.2018 నుంచి 2022 వరకు స్టార్‌ ఇండియా రూ.16, 348 కోట్లకు మీడియా హక్కులను సొంతం చేసుకుంది. ఈ ఏడాదితో టెండర్‌ పూర్తవుతుంది. కొత్త బిడ్డర్‌కు హక్కులు ఈ ఏడాది జూన్‌ను లభిస్తాయి.