మార్చి 17న న్యూస్ ఛానల్స్ రేటింగ్ డేటా
దాదాపు 17 నెలల తరవాత దేశంలో న్యూస్ ఛానల్స్ రేటింగ్ డేటాను విడుదల చేస్తున్నట్లు బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చి కౌన్సిల్ (బార్క్) ఇండియా ఇవాళ వెల్లడించింది. రేటింగ్‌ను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణల కింద ముంబై పోలీసులు కొన్ని ఛానల్స్‌పై కేసు పెట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో న్యూస్ ఛానల్స్ రేటింగ్స్ ఆపేశారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ సలహా మేరకు మళ్ళీ న్యూస్ ఛానల్స్ రేటింగ్‌ను ప్రారంభిస్తున్నారు. దేశంలో న్యూస్ ఛానల్స్ ద్వారా దాదాపు రూ. 32,000 కోట్ల యాడ్స్ ప్రసారం అవుతుంటాయి. రేటింగ్స్ వీటిని ప్రభావితం చేస్తాయని ముంబై పోలీసులు తెలిపారు. ఈ సంవత్సరం 10వ వారం అంటే మార్చి 17న రేటింగ్‌ను విడుదల చేస్తున్నట్లు బార్క్ తెలిపింది.