For Money

Business News

ఆదివారం పనిచేయనున్న బ్యాంకులు

ఈనెల 28 నుంచి అయిదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్న నేపథ్యంలో ఈ నెల 27న అంటే ఆదివారం బ్యాంకులు తెరచి ఉంచాలని ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించాయి. సమ్మెకు ముందు తమ లావాదేవీలను పూర్తి చేసుకునేందుకు కస్టమర్లకు వెసులు బాటు కల్గించేందుకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా 26వ తేదీ చివరి శనివారం. సాధారణంగా ఆ రోజు బ్యాంకులకు సెలవు. ఇక 27 ఆదివారం కాగా, ఈనెల 28 నుంచి మూడు రోజులు అంటే 30వ తేదీ వరకు సమ్మెకు బ్యాంకు ఉద్యోగులు పిలుపు ఇచ్చారు. అంటే వరుసగా అయిదు రోజులు బ్యాంకులు ఉండవన్నమాట. దీంతో కస్టమర్ల ప్రయోజనం కోసం ఈనెల 27న బ్యాంకులు పనిచేసేలా ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా పనిచేస్తాయి. పలు డిమాండ్లతో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపు ఇచ్చారు. అందులో ప్రధాన డిమాండ్‌ వారంలో అయిదు రోజులే పనిదినాలుగా ఉండాలని కోరడం. 2024 మార్చిలో కుదిరిన ఒప్పందం ప్రకారం వారానికి అయిదు రోజులే పని చేసి, రోజుకు 40 నిమిషాలు అదనంగా పనిచేసేందుకు సిద్ధమేనని బ్యాంకు ఉద్యోగులు పేర్కొన్నారు. అయితే దీనికి ప్రభుత్వం నుంచి ఇంకా ఆమోదం రాలేదు.

Leave a Reply