ఆదుకున్న బ్యాంకు షేర్లు
మార్కెట్‌కు ఇవాళ దిగువ స్థాయిలో మద్దతు లభించింది. అయితే ఇది షార్ట్ కవరింగా లేదా తాజా కొనుగోళ్ళా అన్నది తెలియాల్సి ఉంది. అలాగే విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగాయా లేదా కొనసాగుతున్నాయా అన్నది కూడా తేలాల్సి ఉంది. అయితే యాక్సిస్ బ్యాంక్ ఇచ్చిన బూస్ట్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టి, ఫైనాన్షియల్ నిఫ్టి ఒకటిన్నర శాతం లాభంతో క్లోజ్ కావడానికి యాక్సెస్ బ్యాంక్ ఇచ్చిన డోస్. అయితే ఇన్ఫోసిస్ షేర్ మార్కెట్‌ను బాగా నిరుత్సాహపర్చింది. విప్రో ఆకర్షణీయ లాభాలతో ముగిసింది.ఇన్ఫోసిస్ నుంచి మద్దతు అంది ఉంటే నిఫ్టి మరిన్ని లాభాలు పొందేవి. నిఫ్టి ఆరంభంలో 24567 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకినా… కోలుకుని 54886 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. 11.30కల్లా లాభాల్లోకి వచ్చిన నిఫ్టి ఆ తరవాత గ్రీన్‌లోనే కొనసాగింది. చివర్లో స్వల్ప ఒత్తిడి వచ్చినా నిఫ్టి 104 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టిలో 33 షేర్లు లాభాలతో ముగిశాయి. బ్యాంక్ నిఫ్టి కూడా ఆరంభంలో రెడ్‌లో ఉన్నా…తరవాత కోలుకుని 805 పాయింట్ల లాభంతో ముగిసింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎఫ్ అండ్ ఓలో బ్యాన్‌లో ఉంది. ఈ షేర్‌తో పాటు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మినహా… సూచీలోని అన్ని బ్యాంకు షేర్లు గ్రీన్‌లో ముగిశాయి. ఇవాళ నిఫ్టి టాప్ గెయినర్‌గా యాక్సిస్ బ్యాంక్ నిలిచింది. ఈ షేర్ 5.75 శాతం లాభపడింది. తరువాతి స్థానాల్లో విప్రో, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ ఉన్నాయి. బోనస్ షేర్లు జారీ చేస్తున్నట్లు శ్రీరామ్ ఫైనాన్స్ ఇవాళ ప్రకటించింది. ఇక నిఫ్టి టాప్ లూజర్స్‌లో ఇన్ఫోసిస్ ఉంది. ఈ షేర్ నాలుగు శాతంపైగా నష్టపోయింది. తరువాతి స్థానాల్లో బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, నెస్లే, టెక్ మహీంద్రా ఉన్నాయి.