For Money

Business News

బ్యాంకుల ఎన్‌పీఏలు రూ.10 లక్షల కోట్లపైనే..

బ్యాంకులకు మళ్లీ మొండి బకాయిల (ఎన్‌పీఏ) సమస్య వెంటాడుతోంది. 2022 మార్చి నాటికల్లా ఎన్‌పీఏల భారం రూ.10 లక్షల కోట్లు మించిపోతుందని అసోచామ్‌-క్రిసిల్‌ సంస్థల అధ్యయనంలో వెల్లడైంది. బ్యాంకుల మొత్తం రుణాల్లో ఎన్‌పీఏల వాటా 8.5 నుంచి 9 శాతానికి చేరే అవకాశముందని ఈ అధ్యయనం పేర్కొంది. యూపీఏ హయాంలో పెద్ద కంపెనీల రుణాలు ఎక్కువగా ఎన్‌పీఏలుగా మారగా… ఇపుడు రిటైల్‌, ఎంఎస్‌ఎంఈల రుణ ఖాతాల్లో చాలా వరకు ఎన్‌పీఏలుగా మారనున్నాయి. ఇటీవల బ్యాంకులు ఇస్తున్న పర్సనల్, రీటైల్‌ లోన్ల మొత్తం.. కార్పొరేట్‌ రుణాలను మించిన సంగతి తెలిసిందే. కొవిడ్‌ నేపథ్యంలో బ్యాంకులు అనేక రుణాలను పునర్‌ వ్యవస్థీకరించాయి. అయినా కొన్ని రుణ ఖాతాలు కూడా ఎన్‌పీఏలుగా మారే ప్రమాదం ఉందని అసోచామ్‌-క్రిసిల్‌ అంచనా వేస్తున్నాయి. అయితే గత ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే 2021-22 ఆర్థిక సంవత్సరంలో నమోదయ్యే ఎన్‌పీఏల భారం తక్కువగానే ఉంటుందని ఈ అధ్యయనం పేర్కొంది.
Photo courtesy: npaconsultant.in