బ్యాంకుల దెబ్బ… నష్టాలతో ముగింపు
నిన్నటి మాదిరే ఇవాళ కూడా నిఫ్టి పూర్తిగా ఆల్గో ట్రేడింగ్ లెవల్స్ పరిమితమైంది. పలుమార్లు హెచ్చుతగ్గులకు లోనైనా… చివర్లో నష్టాల్లో ముగిసింది. ఉదయం భారీ లాభాలతో ఇవాళ్టి గరిష్ఠ 17,442ను తాకింది. ఇది ఇవాళ్టి ఆల్గో ట్రేడింగ్ లెవల్స్‌లో తొలి స్థాయి. అక్కడి నుంచి నిఫ్టి భారీగా నష్టపోయింది. కోలుకోవడానికి ప్రయత్నించినా…ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 17,235ని తాకింది. అక్కడి నుంచి యూరో మార్కెట్లపై ఆశతో కోలుకుని గ్రీన్‌లోకి వచ్చింది. యూరో మార్కెట్లలో మిశ్రమం ధోరణి వ్యక్తమైంది. కొన్ని గ్రీన్‌లోఉన్నా… మరికొన్ని మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. స్పష్టమైన ట్రెండ్ లేకపోవడంతో చివర్లో బ్యాంక్ నిఫ్టిపై ఒత్తిడి వచ్చింది. ఇవాళ వీక్లీ డెరివేటివ్ క్లోజింగ్ ఉండటంతో 17,276 వద్ద 46 పాయింట్ల నష్టంతో నిఫ్టి ముగిసింది. బ్యాంక్ నిఫ్టి ఇవాళ 1.3 శాతం నష్టంతో ముగియడం విశేషం. నిఫ్టి నెక్ట్స్ సూచీ మినహా మిగిలిన సూచీలన్నీ నష్టాల్లో ముగిశాయి.