ఇవాళ్టికి బ్యాంక్ నిఫ్టి లెవల్స్
సింగపూర్ నిఫ్టి ఇవాళ వంద పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంక్ నిఫ్టిపై వ్యూహాన్ని వివరించారు మార్కెట్ విశ్లేషకుడు రవీంద్ర కుమార్. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ బ్యాంక్ నిఫ్టికి 38040-38290 ప్రాంతంలో మద్దతు ఉంటుందని, రెసిస్టెన్స్ జోన్ 38160-38700గా పేర్కొన్నారు. నిన్న బ్యాంక్ నిఫ్టికి మంచి మద్దతు లభించింది. 37200 కాల్ రేటు రూ. 42 నుంచి రూ. 270 దాకా పెరిగింది. ఇవాళ కూడా బ్యాంక్ నిఫ్టికి మద్దతు లభిస్తుందని రవీందర్ అంచనా వేస్తున్నారు. రిస్క్ తీసుకునేవారు 38800-39,000 టార్గెట్‌గా బ్యాంక్ నిఫ్టిలో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
https://www.youtube.com/watch?v=uSo3XRMUReg