For Money

Business News

ఆదుకున్న బ్యాంక్‌ నిఫ్టి

ఊహించినట్లే నిఫ్టికి 24750 ప్రాంతంలో మద్దతు లభించింది. గిఫ్టి నిఫ్టికి భిన్నంగా నిఫ్టి నామమాత్రపు లాభాల్లో ప్రారంభమైంది.కొన్ని నిమిషాల్లోనే 24,753ని తాకింది. కాని కొన్ని నిమిషాల్లోనే తేరుకుని లాభాల్లోకి వచ్చేసింది. మిడ్‌సెషన్‌లో నిఫ్టి మళ్ళీ నష్టాల్లోకి చేరినా… ఆ ట్రెండ్‌ కొద్దిసేపు మాత్రమే నిలిచింది. ఆ తరవాత కూడా పెరిగినపుడల్లా ఒత్తిడి వచ్చింది. వీటిని తట్టుకుంటూ నిఫ్టి 24936 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 84 పాయింట్లు పెరిగింది. అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉండటం, బ్యాంకు షేర్లకు మద్దతు లభించడంతో నిఫ్టిలో పతనం ఆగింది. ఇవాళ కూడా క్రూడ్‌ ఆధార షేర్లకు మద్దతు లభించింది. ఇవాళ స్పైస్‌జెట్‌, ఒలా షేర్లు హాట్‌ టాపిక్‌గా మారాయి. ప్రమోటర్లు వాటాను అమ్ముతున్నట్లు వచ్చిన వార్తలతో స్పైస్‌జెట్‌ షేర్‌ ఇవాళ 64.86ని తాకి రూ. 64 వద్ద ముగిసింది. ఇక ఒలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ షేర్లు ఇవాళ ఇన్వెస్టర్లను షాక్‌కు గురి చేశాయి. ఇవాళ ఈ షేర్‌లో ఉన్న ఒక నెల లాకిన్‌ పీరియడ్‌ పూర్తయింది. దీంతో ఆరంభంలో ఇన్వెస్టర్లు షేర్‌ భారీగా అమ్మారు. ఈ షేర్‌ ధర నిన్నటి స్థాయి రూ. 109.65 నుంచి రూ. 103.50కి పడిపోయింది. కాని దిగువస్థాయిలో మద్దతు అందడంతో షేర్‌ రూ. 114.70 వద్ద ముగిసింది. అలాగే బ్యాంక్‌ షేర్లు కూడా. నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో ఇవాళ హిందుస్థాన్‌ లీవర్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ, బ్రిటానియా ముందున్నాయి. ఇక నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో ఓఎన్‌జీసీ, టెక్‌ మహీంద్రా, బీపీసీఎల్‌, టాటా స్టీల్‌, హిందాల్కో ముందున్నాయి.

Leave a Reply