For Money

Business News

నిఫ్టికి బ్యాంకుల అండ

ఓపెనింగ్‌లో అరగంటలోనే నిఫ్టి ఇవాళ్టి కనిష్ఠ స్థాయిని నమోదు చేసుకుంది. అక్కడి నుంచి క్రమంగా బలపడుతుంది. 16,647కు చేరింది. కనిష్ఠ స్థాయి నుంచి 150 పాయింట్లు లాభపడిన నిఫ్టి 16,624 పాయింట్ల వద్ద 128 పాయింట్ల లాభంతో ముగిసింది. ఉదయం నిరాశపర్చిన నిఫ్టికి… అనుకోకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అనూహ్య మద్దతు అందింది. బ్యాంక్‌ నిఫ్టి ఏకంగా 1.67 శాతం పెరిగింది. మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ కూడా 1.8 శాతం పెరగడం విశేషం. మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలో అడుగు పెట్టేందుకు బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌కు సెబి అనుమతి ఇవ్వడంతో ఫైనాన్షియల్‌ షేర్ల సూచీ 1.4 శాతం పెరిగింది.నిఫ్టిలో 35 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఉదయం అనుకున్నట్లు నిన్నటి ముగింపు 16,495 వద్ద నిఫ్టికి గట్టి మద్దతు లభించింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 16,460.00 7.78
హిందాల్కో 422.50 3.85
అదానీ పోర్ట్స్‌ 693.65 3.79
టాటా స్టీల్‌ 1,407.15 3.57
బజాజ్‌ ఫైనాన్స్‌ 6,980.00 3.37

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
నెస్లే ఇండియా 19,740.00 -1.40
బ్రిటానియా 3,812.00 -1.40
ఏషియన్‌ పెయింట్‌ 3,045.10 -1.05
హెచ్‌డీఎఫ్‌సీ 2,694.00 -1.03
ఇన్ఫోసిస్‌ 1,721.50 -0.99