బంధన్ కన్సార్టియం చేతికి IDFC AMC?
ఐడీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్‌ను కొనుగోలు చేయడంలో బంధన్ బ్యాంక్ కన్సార్టియం ముందుంది. ఈ డీల్‌పై తుది నిర్ణయం ఇవాళ వెలువడే అవకాశముంది. ఈ డీల్ విలువ రూ. 4,500 కోట్లు ఉంటుందని అంచనా. బంధన్ బ్యాంక్ ప్రమోటర్ అయిన బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌తో పాటు సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ జీఐసీ, దేశీయ పీఈ సంస్థ క్రిస్ క్యాపిటల్‌లు కన్సార్టియంలో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్‌పై తుది నిర్ణయం తీసుకునేందుకు ఫండ్ మాతృసంస్థ ఇవాళ సమావేశం కానుంది. ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది. బంధన్ బ్యాంక్ ఈ డీల్‌లో విజయం సాధిస్తే… బ్యాంక్ టేకోవర్ చేసిన రెండో పెద్ద డీల్ ఇదే అవుతుంది. పైగా ఫైనాన్షియల్ రంగలో బంధన్ బ్యాంక్ మరింత విస్తరించనుంది.