For Money

Business News

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ .. ఆఫర్‌ ధర రూ.56-59

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూములు నిర్వహించే ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా లిమిటెడ్‌ పబ్లిక్‌ ఆఫర్‌ వచ్చే నెల 4న ప్రారంభం కానుంది. ఈ పబ్లిక్‌ ఆఫర్‌ ధరల శ్రేణిని రూ.56-59గా కంపెనీ నిర్ణయించింది. అంటే గరిష్ఠ ధర రూ. 59 కాగా, కనిష్ఠ ధర రూ. 56. కంపెనీ షేర్‌ ముఖ విలువ రూ. 10. ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.500 కోట్లు సమీకరించనుంది కంపెనీ. ఇష్యూ నిధుల్లో రూ.111.44 కోట్లు మూలధన వ్యయాలకు, రూ.220 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు వినియోగించనుంది. రూ.55 కోట్ల మేర రుణాలను తీర్చేయనుంది. ఇష్యూలో 35 శాతం షేర్లను రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఆఫర్‌ చేస్తారు. రీటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 254 షేర్లకు (ఒక లాట్‌) దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే దరఖాస్తు మొత్తం రూ. 14,988. అదే గరిష్ఠ షేర్లకు దరఖాస్తు చేయాలంటే 3302 షేర్లకు (13 లాట్లు) అంటే రూ. 1,94,819 దరఖాస్తు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇష్యూ వచ్చే నెల 7న ముగుస్తుంది. అదే నెల 17వ తేదీన షేర్లు స్టాక్‌ మార్కెట్‌లో లిస్టవుతాయి.