For Money

Business News

ఈ ఇష్యూపై 80 శాతం లాభమా?

షేర్‌ మార్కెట్‌తో పరిచయం ఉన్నవారికి బజాజ్‌ ట్విన్స్ గురించి తెలుసు. అందులో బజాజ్‌ ఫైనాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కంపెనీ ప్రమోట్‌ చేసిన బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్ ఐపీఓ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ఈనెల 9న ప్రారంభం కానుంది. ఇష్యూ 11న ముగుస్తుంది. 12న షేర్ల అలాట్‌మెంట్‌ ఉంటుంది. 13న షేర్లను ఇన్వెస్టర్ల ఖాతాలో జమ అవుతాయి. ఈనెల 16వ తేదీన స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో షేర్లు లిస్ట్‌ అవుతాయి. మొత్తం రూ.6,560 కోట్ల విలువైన షేర్లను ఈ ఇష్యూ కింద కంపెనీ ఆఫర్‌ చేస్తోంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.66-70గా కంపెనీ నిర్ణయించింది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు ముందుగానే అంటే ఈనెల 6న బిడ్డింగ్‌ విండో ఓపెన్‌ కానుంది. ఐపీఓలో భాగంగా రూ.3,560 కోట్లు విలువైన తాజా షేర్లను జారీ చేయడం ద్వారా సమీకరిస్తారు. మరో రూ.3వేల కోట్లు విలువైన షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా బజాజ్‌ ఫైనాన్స్‌ తన షేర్లను విక్రయిస్తోంది. ఐపీఓలో భాగంగా మదుపర్ల కనీసం 214 ఈక్విటీ షేర్లతో కూడిన లాట్‌కు బిడ్‌ వేయాల్సి ఉంటుంది. అంటే గరిష్ఠ ధర వద్ద రూ. 14,980 ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. 2023-24 పూర్తి సంవత్సరానికి బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ రూ.1731 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఆఫర్‌ ధర గరిష్ఠంగా రూ. 70 కాగా మార్కెట్‌లో ఇపుడు అనధికార ప్రీమియం రూ. 56 నడుస్తోంది. అంటే 80 శాతం లాభంతో షేర్లు లిస్ట్ అవుతాయన్నమాట.

Leave a Reply