For Money

Business News

షేర్ల విభజన ప్లస్‌ బోనస్‌

రూ .5 ముఖ విలువ గల ఒక్కో షేరును రూ .1 విలువైన షేర్లుగా విభజించేందుకు బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ బోర్డు ఆమోదించింది. దీంతో ఒక షేరు స్థానంలోనే వాటాదారులకు అయిదు షేర్లు జారీ చేస్తారు. ఈ మార్పిడి జరిగిన తరవాత మళ్ళీ ఒక షేరుకు మరో షేర్‌ బోనస్‌గా ఇస్తారు. అంటే విభజన తరవాత అందిన అయిదు షేర్లకు మరో అయిదు షేర్లు ఇస్తారన్నమాట. వచ్చే ఏజీఎంలో వాటాదారుల ఆమోదం తరవాత ఈ షేర్ల విభజన, బోనస్‌ షేర్ల జారీ ఉంటుంది. జూన్‌ తో ముగిసిన త్రైమాసికంలో బజాజ్ ఫినసర్వ్ ఆదాయం రూ.15,888 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే టర్నోవర్‌ 14 శాతంపైగా పెరిగింది. నికర లాభం మాత్రం 57 శాతం పెరిగింది. 2021-22 ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ .833 కోట్లు కాగా… ఈ ఏడాది రూ .1309 కోట్లకు చేరింది. అంటే 57 శాతం పెరిగిందన్నమాట.