వాల్మీకి అయోధ్య ఎయిర్పోర్ట్
అయోధ్య ఎయిర్‌పోర్టు పేరును ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మార్చింది. ఈ విమానాశ్రయం పేరును మహర్షి వాల్మీకీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య ధామ్‌గా మార్చినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. అయోధ్యలో నిర్మించిన ఈ కొత్త ఎయిర్‌పోర్ట్‌ను రేపు ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య ఖ్యాతిని మరింతగా పెంచేందుకు ఎయిర్పోర్ట్ పేరును మార్చినట్లు తెలుస్తోంది. రూ. 1,450 కోట్లతో తొలి దశ నిర్మాణం పూర్తయింది. అయోధ్యలో రూ.2,180 కోట్లతో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ టౌన్‌షిప్‌కు కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనుంది.