సిటీ బ్యాంక్‌తో యాక్సిస్ బ్యాంక్ డీల్ ఓకే
భారతదేశంలో రీటైల్ బిజినెస్ నుంచి వైదొలగాలని సిటీ బ్యాంక్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టింది. వచ్చిన బిడ్లలో యాక్సిస్ బ్యాంక్ బిడ్‌కు ఒకే చేసింది. 160 కోట్ల డాలర్లకు సిటీ బ్యాంక్ ఇండియా రీటైల్ వ్యాపారాన్ని యాక్సిస్ బ్యాంక్ తీసుకుంది. క్రెడిట్ కార్డులు, రీటైల్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్, కన్జూమర్ లోన్లు వంటి మొత్తం కన్జూమర్ బ్యాంకింగ్ బిజినెస్‌ను సిటీ బ్యాంక్ నుంచి తీసుకుంది. అందులో భాగంగా సిటీ బ్యాంక్‌కు ఉన్న ఎన్బీఎఫ్సీ సిటీ కార్ప్ ఫైనాన్స్ (ఇండియా)కు చెందిన వ్యాపారం కూడా యాక్సిస్ బ్యాంక్ చేతికి వచ్చింది. వచ్చే ఏడాది జులైకల్లా వ్యాపార బదిలీ పూర్తికానుంది. సిటీ ఇండియాకు చెందిన 3600 మంది ఉద్యోగులు యాక్సిస్‌లో చేరుతారు.