అంచనాలను దాటేసింది
ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి శుభవార్త. ఇవాళ బజాజ్ ఆటో ఫలితాల తరవాత అందరి చూపు ప్రైవేట్ బ్యాంకింగ్‌పై పడింది. ఏ మాత్రం నెగిటివ్ ఫలితాలు వచ్చినా.. మొత్తం రంగం రీరేటింగ్ జరిగింది. అయితే ఇవాళ ఫలితాలు ప్రకటించిన యాక్సిస్ బ్యాంక్… మార్కెట్ అంచనాలను అధిగమించింది. సీఎన్‌బీసీ టీవీ18 నిర్వహించిన అనలిస్టుల సర్వేలో బ్యాంక్ రూ. 6,300 కోట్ల నికర లాభం ప్రకటిస్తుందని అంచనా వేశారు. ఈ అంచనాలకు మించి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంక్ రూ. 6918 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. పలు విభాగాల్లో బ్యాంక్ అదరగొట్టింది.గత ఏడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 10 శాతం పెరిగి రూ. 12,314 కోట్ల నుంచి రూ. 13,483 కోట్లకు చేరింది. అలాగే నికర లాభం 18 శాతం పెరిగి రూ. 5,863 కోట్ల నుంచి రూ. 6918 కోట్లకు చేరింది. స్థూల ఎన్‌పీఏలు 1.7 శాతం పెరిగి రూ. 3553 కోట్ల నుంచి రూ. 3612 కోట్లకు చేరాయి. అయితే స్థూల ఎన్‌పీఏలు మాత్రం 4.6 శాతం తగ్గి రూ. 15466 కోట్లకు చేరినట్లు యాక్సిస్ బ్యాంక్ పేర్కొంది. నికర ఎన్‌పీఏల శాతం 0.34 శాతంగా కొనసాగుతోంది.