For Money

Business News

అరబిందో ఫార్మా యూనిట్‌కు FDA వార్నింగ్‌

హైదరాబాద్‌లోని యూనిట్‌ 1కు అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FDA) వార్నింగ్‌ లెటర్‌ పంపింది. ఏడు అంశాల్లో కంపెనీ ప్రమాణాలు పాటించడం లేదని ఆ వార్నింగ్‌లో పేర్కొంది.ఈ యూనిట్‌ను గత ఏడాది ఆగస్టు 2 నుంచి 12 వరకు ఎఫ్‌డీఏ బృందం పరిశీలించింది. దీనికి సంబంధించిన వార్నింగ్‌ లెటర్‌ను నవంబర్‌లో విడుదల చేసినట్లు అరబిందో పేర్కొంది. ఈ యూనిట్‌లో తయారు చేసే మందులు అమెరికాకు ఎగమతి చేస్తారు. ఎఫ్‌డీఏ అధికారులతో తాము చర్చలు జరుపుతున్నామని, సమస్య పరిష్కారం అవుతుందని అరబిందో ఫార్మా పేర్కొంది. ఈలోగా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో కంపెనీ షేర్‌ 4.5 శాతం దాకా క్షీణించింది.