న్యూజెర్సి యూనిట్‌ను మూసేసిన అరబిందో
అమెరికాలోని న్యూజెర్సి రాష్ట్రంలోని డేటన్ సిటీలో ఉన్న తన తయారీ యూనిట్‌ను మూసివేస్తున్నట్లు అరబిందో ఫార్మా ప్రకటించింది. అరో లైఫ్ ఫార్మా ఎల్ఎల్సీ పేరుతో ఈ నగరంలో అరబిందో ఫార్మాకు తయారీ యూనిట్ ఉంది. యాక్టిక్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడెంట్స్ (APIs) తయారు చేసే ఈ యూనిట్లో 99 మంది కార్మికులు ఉన్నారని, వారికి నిబంధనల ప్రకారం 60 రోజుల జీతం ఇచ్చి ప్లాంట్ మూసివేస్తున్నట్లు అమెరికా కార్మిక శాఖకు పంపిన నోటీసులో అరోలైఫ్ పేర్కొంది. ఈ యూనిట్‌ను అమెరికా ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అధికారులు పర్యటించిన ప్రతిసారీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 2018, 2020లలో ఎఫ్‌డీఐ ఈ ప్లాంట్‌ను సందర్శించి.. ప్లాంట్‌లో ఏమాత్రం శుభ్రత లేదని, ఒకే రూమ్‌లో అయిదు చోట్ల నీళ్ళు లీక్ అవుతున్నాయని అభ్యంతరాలు తెలిపింది. అయినా మందులను కార్మికులకు ప్యాక్ చేస్తున్నారని పేర్కొంది. 2020 నవంబర్ నెలలో కంపెనీకి ఎఫ్‌డీఏ నుంచి గట్టి వార్నింగ్ లెటర్ కూడా వచ్చింది. ఎఫ్‌డీఐ తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో మొత్తం ప్లాంట్‌నే అరబిందో ఫార్మా మూసేస్తున్నట్లు తెలుస్తోంది.