For Money

Business News

ఏథర్‌లో మా వాటా అమ్మం

ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ కంపెనీ ఏథర్‌ ఎనర్జి ఐపీఓకు రెడీ అవుతోంది. కంపెనీ ఇవాళ సెబి వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఈ పబ్లిక్‌ ఆఫర్‌లో తమకు ఉన్న వాటాను అమ్మడం లేదని హీరో మోటోకార్ప్‌ వెల్లడించింది. ఏథర్‌లో ఈ కంపెనీ 37.2 శాతం వాటా ఉంది. అయితే ఇతర ఇన్వెస్టర్లు మాత్రం తమ వాటాలో కొంత భాగాన్ని ఈ పబ్లిక్‌ ఆఫర్‌ కింద అమ్ముతున్నారు. వీరు 2.2 కోట్ల షేర్లను అమ్ముతారని, మరో రూ. 3,100 కోట్ల విలువైన కొత్త షేర్లను పబ్లిక్‌ ఇష్యూలో ఆఫర్‌ చేస్తారని తెలుస్తోంది. కంపెనీ స్థాపకులైన తరుణ్‌ సంజయ్‌ మెహతా, స్వప్నిల్‌ బబన్‌ లాల్‌ జూన్‌లు తమవాటాలో కొంత భాగాన్ని అంటే పది లక్షల షేర్లను ఈ ఆఫర్‌ కింద అమ్మనున్నారు. వాటా అమ్మనున్న ఇతర ఇన్వెస్టరర్లలో కలాడియమ్‌ ఇన్వెస్ట్‌మెంట్ పీటీఈ, నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ 2, 3 స్టేట్‌ వెంచర్స్‌ పీటీఈ, టైగర్‌ గ్లోబల్‌కు చెందిన ఇంటర్‌నెట్‌ ఫండ్ ఉన్నాయి. పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా వచ్చిన మొత్తాన్ని మహారాష్ట్రలో కొత్తగా నెలకొల్పే తయారీ కేంద్రంపై వెచ్చిస్తారు.

Leave a Reply