వాల్‌స్ట్రీట్ బాటలో ఆసియా మార్కెట్లు
రాత్రి డల్‌గా ప్రారంభమైన వాల్‌స్ట్రీట్… క్లోజింగ్‌కల్లా ఒక మోస్తరు లాభాలతో ముగిసింది.ముఖ్యంగా నాస్డాక్ అరశాతంపైగా లాభంతో ముగిసింది. యాపిల్ షేర్ నిన్న రాత్రి నాస్డాక్క అండగా నిలిచింది. వడ్డీ రేట్లను ఈ ఏడాది పెంచడం లేదని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ప్రకటించడంతో రాత్రి అమెరికా డాలర్ క్షీణించింది. డాలర్ ఇండెక్స్ 96కి పడిపోయింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి మెజారిటీ ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్ నిక్కీ, న్యూజిల్యాండ్ మాత్రం రెడ్లోఉన్నాయి. చాలా రోజుల తరవాత చైనా మార్కెట్లు మంచి ఊపు మీద ఉన్నాయి. హాంగ్‌కాంగ్ ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది.