భారీ నష్టాల్లో SGX NIFTY
స్టాక్ మార్కెట్ ఆర్బీఐ పాలసీని ఏమాత్రం పట్టించుకోలేదు. అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్ ఉండటంతో గత శుక్రవారం మన మార్కెట్లు కొనుగోళ్ళ మద్దతు వచ్చింది. గత కొన్ని వారాలుగా బ్యాంక్ షేర్లకు మద్దతు ఇస్తున్న ఇన్వెస్టర్లు గత శుక్రవారం ఇచ్చారు. ఆర్బీఐ పాలసీకి స్పందించి కాదు. మన మార్కెట్ల అంచనాలకు భిన్నంగా అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూరో మార్కెట్లు గ్రీన్‌లో ముగిసినా… వాల్‌స్ట్రీట్‌లో అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ఉంది. అన్ని సూచీలు ఒకటిన్నర శాతంపైగా నష్టపోయాయి. ముఖ్యంగా డౌజోన్స్ 1.7 శాతం క్షీణించింది. డాలర్ మరింత బలహీన పడింది. డాలర్ ఇండెక్స్ 112 వద్ద ట్రేడవుతోంది. అయితే ఈ వారం సమావేశం కానున్న ఒపెక్ క్రూడ్ ఉత్పత్తిని తగ్గించే అంశాన్ని పరిశీలించనుంది. దీంతో క్రూడ్ ఆయిల్ 2.5 శాతంపైగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. ఒక్క జపాన్ మాత్రం 0.68 శాతం లాభంతో ఉంది. చైనా మార్కెట్లకు సెలవు. హాంగ్‌సెంగ్‌తో సహా అన్ని మార్కెట్లు రెడ్‌లో ఉన్నాయి. గతవారం నేచురల్ గ్యాస్ ధరలు పెంచడంతో మన మార్కెట్లు ఎలా స్పందిస్తాయో చూడాలి. సింగపూర్ నిఫ్టి మాత్రం 130 పాయింట్లకు పైగా నష్టంతో ఉంది. సో… నిఫ్టి 17000 దిగువన ప్రారంభమయ్యే అవకాశముంది.