For Money

Business News

వాల్‌స్ట్రీట్‌ బాటలో ఆసియా, నిఫ్టి

వాల్‌స్ట్రీట్‌ పతనం ప్రభావం ఆసియా మార్కెట్లలో కన్పిస్తోంది. అన్ని దేశాల సూచీలు నష్టాల్లో ఉన్నాయి. అత్యధికంగా రెండు శాతంపైగా జపాన్‌ మార్కట్‌ నష్టంతో ట్రేడవుతోంది. చైనా మార్కెట్‌ కూడా ఒకటిన్నర శాతం నష్టంతో ఉంది. ఇటీవల క్షీణిస్తూ వస్తున్న హాంగ్‌సెంగ్ కూడా 0.75 శాతం నష్టంతో ట్రేడవుతోంది. సింగపూర్‌ నిఫ్టి 150 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఇదే స్థాయిలో నష్టంతో నిఫ్టి ప్రారంభమౌతుందా అన్నది చూడాలి.