అశ్వని గుజ్రాల్ – ఆప్షన్ బెట్స్
మార్కెట్‌లో ఒడుదుడుకుల తీవ్రంగా ఉంటున్నాయి. ఎస్ అండ్ పీలో ఇటీవల వచ్చిన ర్యాలీలో 50 శాతం పోయింది. దీంతో మళ్ళీ బేర్ ఫేజ్‌లోకి వచ్చేసిందని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ అంటున్నారు. అలాగే నిఫ్టిలో ఇటీవల వచ్చిన ర్యాలీలో 50 శాతం పోవడమంటే… 16300 లోపల నిఫ్టి క్లోజ్ అవ్వాలి. అంటే 16300 దిగువన క్లోజైతే… మార్కెట్‌లో ర్యాలీ పూర్తయినట్లేనని, బ్యాంక్ నిఫ్టిలో 34500 దిగువన వస్తే ర్యాలీ పూర్తయినట్లని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణ ప్రభావం ఒక్క రోజులో పూర్తయ్యేది కాదని… దాని క్రమాన్ని బట్టి మారుతూ ఉంటుందని అన్నారు. మార్కెట్ అటూ ఇటూ కదలాడే సమయంలో… అట్ ద మనీలో అంటే 16200 కాల్, పుట్‌ను తీసుకోవడం మంచిదని ఆయన సలహా ఇస్తున్నారు. లేదా మరో స్ట్రాడల్ ఏర్పాటు చేసుకోవచ్చని.. అపుడు 16000 పుట్ లేదా 16500 కాల్ కొనుగోలు చేయడం మంచిదని ఆయన అన్నారు. ఇన్నాళ్ళూ అటు ఇటూ కదలాడిన నిఫ్టి ఇపుడు అటో ఇటో తేల్చుకునే స్థితిలో ఉందని ఆయన అన్నారు. ఈ పరిస్థితిని లాభదాయకంగా చేసుకోవాలంటే స్ట్రాడల్ తీసుకోవడం ఉత్తమ పద్ధతి అని అశ్వని గుజ్రాల్ అంటున్నారు.
కొనండి
రిలయన్స్ ఇండస్ట్రీస్
2800 జూన్ కాల్
స్టాప్‌లాప్ : రూ. 58
టార్గెట్ : రూ. 102
కొనండి
ఇన్ఫోసిస్
1520 జూన్ కాల్
స్టాప్‌లాప్ : రూ. 32
టార్గెట్ : రూ. 45
కొనండి
టాటా స్టీల్
1040 జూన్ పుట్
స్టాప్‌లాప్ : రూ. 56
టార్గెట్ : రూ. 92
కొనండి
గోద్రెజ్ ప్రాపర్టీస్
షేర్ ధర : రూ. 1373
స్టాప్‌లాప్ : రూ. 1350
టార్గెట్ : రూ. 1420
అమ్మండి
హిందుస్థాన్ జింక్
షేర్ ధర : రూ. 292.90
స్టాప్‌లాప్ : రూ. 296
టార్గెట్ : రూ. 284