For Money

Business News

అశ్వని గుజ్రాల్‌… డే ట్రేడింగ్‌ బెట్స్‌

నిఫ్టికి 16000 కీలక మద్దతు స్థాయిగా నిలుస్తుందని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు. నాస్‌డాక్‌ కూడా 30 శాతం క్షీణించి 2020 సెప్టెంబర్‌ నెల కనిష్ఠానికి పడిపోయిందని అన్నారు. దీంతో నాస్‌డాక్‌తో పాటు ఇతర మార్కెట్లలో కూడా పుల్‌ బ్యాక్‌ ర్యాలీ రావొచ్చని అంటున్నారు. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు మార్కెట్‌ క్షీణించినపుడు 16800 మే కాల్‌ కాంట్రాక్ట్‌ను కొనుగోలు చేయమని ఆయన సలహా ఇచ్చారు.

కొనండి
షేర్‌
బీఈఎల్‌
ప్రస్తుత ధర రూ. 225.25
లక్ష్యం రూ. 240
స్టాప్‌ లాస్ రూ. 221

కొనండి
షేర్‌… ఎం అండ్‌ ఎం
ప్రస్తుత ధర రూ. 891.70
లక్ష్యం రూ. 920
స్టాప్‌ లాస్ రూ. 881

అమ్మండి
షేర్‌… టాటా స్టీల్‌
ప్రస్తుత ధర రూ. 1251.20
లక్ష్యం రూ. 1225
స్టాప్‌ లాస్ రూ. 1270

అమ్మండి
షేర్‌… ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
ప్రస్తుత ధర రూ. 891.15
లక్ష్యం రూ. 865
స్టాప్‌ లాస్ రూ. 910

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ నిపుణుల అభిప్రాయలను, సలహాలను, సిఫారసులను పాఠకుల అవగాహన కోసం ఇచ్చే ప్రయత్నం ఇది. పెట్టుబడికి సంబంధించి తుది నిర్ణయం తీసుకునే ముందు మీరు మీ ఫైనాన్షియల్‌ అడ్వయిజర్‌ సలహా తీసుకోవడం మర్చిపోకండి.