For Money

Business News

లిస్టింగ్‌ రోజే బంపర్‌ లాభం

ఇటీవల సెకండరీ మార్కెట్‌కన్నా ప్రైమరీ మార్కెట్‌ రీటైల్‌ ఇన్వెస్టర్లను బాగా ఆకర్షిస్తోంది. ఐపీఓలకు అందుతున్న ఆదరణ… లిస్టింగ్‌ రోజు ప్రీమియం చెప్పకనే చెబుతోంది. దాదాపు వంద శాతంపైగా లాభాలు అందించిన బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తరవాత మరో బంపర్‌ ఐపీఓ రేపు లిస్ట్‌ కానుంది. ఇటీవల సెకండరీ మార్కెట్‌లో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల షేర్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు ఆర్కేడ్‌ డెవలపర్స్‌ ఐపీఓ లిస్ట్‌ కానుంది. ఈ కంపెనీ రూ. 128 గరిష్ఠ ధరతో షేర్లను ఆఫర్‌ చేసింది. ఈ ఇష్యుకు వంద రెట్ల ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌ వచ్చింది. రేపు ఈ షేర్‌కు కనీసం 50 శాతం ప్రీమియం లభించవచ్చని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం గ్రే మార్కెట్‌లో ఈ షేర్‌కు రూ. 63 ప్రీమియం లభిస్తోందని వార్తలు వస్తున్నాయి.

Leave a Reply