దొంగలించిన ఐఫోన్లను రిపేర్ చేయం
చాలా మంది దొంగలు … తాము చోరీ చేసిన ఫోన్లను యాపిల్ స్టోర్స్‌లో అన్‌లాక్ లేదా రిపేర్ చేయించుకుంటారు. వీరి యాపిల్ కంపెనీ షాక్ ఇచ్చింది. ఇక తమ ఆథరైజ్డ్ షోరూమ్‌లలో ఇలా దొంగలించిన యాపిల్ ఫోన్లను రిపేర్ చేయరాదని యాపిల్ నిర్ణయించింది. సాధారణంగా ప్రతి ఐఫోన్‌కు GSMA డివైజ్ రిజస్ట్రి ఉంటుంది. సాధారణంగా ఎవరైనా తమ ఫోన్ పోతే వెంటనే ఆ రిజిస్ట్రీలో దొంగలించారని నమోదు చేస్తారు. అలాగే ఒకవేళ ఫోన్ మిస్సయినా ఆ రిజిస్ట్రీలో నమోదు చేస్తారు. పోలీసులు ఇలాంటి ఫోన్లను కనిబెట్టేందుకు ఇది ఉపకరిస్తుంది. ఇక నుంచి ఈ రిజిస్ట్రీలో నమోదైన ఫోన్లను రిపేర్ చేయరాదని యాపిల్ నిర్ణయించింది. ఇక నుంచి యాపిల్ టెక్నీషియన్స్… యాపిల్ ఫోన్‌ను ముందుగా GSMA డివైజ్ రిజిస్ట్రీ చూసి… రికార్డు క్లీన్‌గా ఉంటేనే రిపేరు చేస్తారు. Stolen లేదా Missing అని ఉంటే రిపేర్ చేయరు. అలాగే Find My Appలో ఎవరైనా యాపిల్ యూజర్ తన ఫోన్ పోయిందని ఈ యాప్‌లో Lost Modeలో మార్క్ చేస్తే…ఆ ఫోన్ ఆటోమేటిక్‌గా లాక్ అయిపోతుంది. లాక్ అయిన తరవాత ఫోన్ స్క్రీన్‌పై కాంటాక్ట్ సమాచారం వస్తుంది. అన్‌లాక్ కోసం వెళ్ళినపుడు యాపిల్ టెక్నిషియన్స్ GSMA రిజస్ట్రిలో చూస్తారు. అక్కడ Stolen లేదా Missing అని నమోదు చేసి ఉంటే అన్‌లాక్ చేయడానికి నిరాకరిస్తారు.