For Money

Business News

కాసేపట్లో… ఐఫోన్‌ 16 విడుదల

ప్రతి ఏటా జరిగే యాపిల్‌ వార్షిక ఉత్సవం కాస్సేపట్లో కాలిఫోర్నియాలోని కంపెనీ యాపిల్‌ పార్క్‌లో ప్రారంభం కానుంది. ఇట్స్‌ గ్లోటైమ్‌ పేరుతో ఈ సారి యాపిల్ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. యాపిల్‌ అభిమానులందరూ కొత్త ఫోన్‌ కోసం, దాని స్పెసిఫికేషన్స్‌ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈసారి యాపిల్‌ 16 ఫోన్‌ చాట్‌ చీపీటీతో వస్తోంది. ఇంకా ఎయిర్‌ పాడ్స్‌4, యాపిల్‌ వాచ్‌X కూడా ఇవాళ విడుదల కానుంది. యాపిల్‌ ఈవెంట్‌ మన దేశంలో ఇవాళ రాత్రి 10.30 గంటల నుంచి చూడొచ్చు. ముఖ్యంగా యాపిల్‌ 16కు సంబంధించి సోషల్‌ మీడియాలో చాలా అప్‌డేట్స్‌ వస్తున్నాయి. ఐఫోన్‌ 16 సిరీస్‌ నాలుగు మోడల్స్‌లో వస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాటరీ లైఫ్‌ ఎక్కువగా ఉండటంతో పాటు త్వరగా చార్జి అయ్యేలా కొత్త మోడల్‌ ఉంటుందని సోషల్‌ మీడియాలో పోస్టింగ్స్‌ వస్తున్నాయి. 16 సిరీస్‌లో ప్లస్, ప్రొ, ప్రొ మ్యాక్స్‌ మోడల్స్‌ కూడా ఉంటాయని తెలుస్తోంది. కొత్త ఐప్యాడ్ మినీ కూడా రాబోతోంది. అయితే ఈ ఈవెంట్‌లో కాకుండా దీని కోసం ప్రత్యేకంగా అక్టోబర్‌లో ఈవెంట్‌ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. సాధారణంగా యాపిల్‌ ఈవెంట్ మంగళవారం జరుగుతుంది. కాని ఈసారి సోమవారం నిర్వహిస్తున్నారు. రేపు అంటే మంగళవారం తొలిసారిగా అమెరికా అధ్యక్ష పదవి కోసం తలపడుతున్న కమలా హారిస్‌, డొనాల్డ్ ట్రంప్‌ మధ్య టీవీ డిబేట్‌ ఉంది. దీంతో యాపిల్ ఈవెంట్‌ను ఒక రోజు ముందుగానే నిర్వహిస్తున్నారు.

Leave a Reply