For Money

Business News

శ్రీలంక అధ్యక్షుడిగా వామపక్ష నేత

మార్క్సిస్ట్‌ నేత అనుర కుమార దిశనాయక శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈసారి శ్రీలంకలో అధ్యక్ష పదవికి త్రిముఖ పోటీ జరిగింది. తొలుత విజయానికి అవసరమైన 50 శాతానికి పైగా ఓట్లు ఏ అభ్యర్థికీ రాలేదు. రెండో రౌండ్‌ కౌంటింగ్‌లో 42.32 శాతం ఓట్లతో కుమార దిసనాయకే విజయం సాధించినట్లు శ్రీలంక మీడియా పేర్కొంది. ఇటీవల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కోవడంతో శ్రీలంక ప్రజలు పాలనలో పూర్తి మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టమైంది. పైగా త్రిముఖ పోరు కావడంతో ఓట్లు చీలి పోయాయి. విపక్ష నేత ప్రేమదాస రెండో స్థానంలో నిలవగా, విక్రమసింఘే చాలా దూరంగా మూడోస్థానంలో నిలిచారు. అనుర దిశనాయక రేపు అంటే సోమవారం శ్రీలంక అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

Leave a Reply