For Money

Business News

ఇండస్‌ ఇండ్‌లో మరో స్కామ్‌

ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. అనేక సంవత్సరాలుగా బ్యాంక్‌లో జరుగుతున్న అవకతవకల గురించి ఓ విజిల్‌ బ్లోయర్‌ ఆర్బీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే బ్యాంక్‌ గవర్నింగ్‌ బోర్డుకు ఆ లేఖను పంపినట్లు సమాచారం. మైక్రోఫైనాన్స్‌కు సంబంధించి అనేక రకాల తప్పుడు ఎంట్రీలు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. డెరివేటివ్స్‌ గోల్‌ మాల్‌ తరవాత ఇపుడు అకౌంటింగ్‌ అవకతవకలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా లేని వడ్డీ ఆదాయాన్ని బ్యాంకు ఖాతాల్లో చూపినట్లు తెలుస్తోంది. ఇతర ఆస్తులు, ఇతర అప్పుల విషయంలో అనేక తప్పుడు ఎంట్రీలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బ్యాంక్‌లో పనిచేసే ఓ సీనియర్‌ ఉద్యోగికి అలాగే బ్యాంక్‌లో పనిచేసే ఉద్యోగితో ఉన్న అక్రమ సంబంధం గురించి కూడా లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. లేఖ బోర్డుకు అందిన వెంటనే బ్యాంక్‌ దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్యాంక్‌ ఖాతాల ఫోరెన్సి ఆడిటింగ్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా సమాచారం.