అమ్మకానికి ఆంధ్రా ఫెర్రో అల్లాయ్స్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో కంపెనీని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) అమ్మకానికి పెడుతోంది. ఆంధ్రా ఫెర్రో అల్లాయ్స్ నుంచి రావాల్సిన రూ.26.73 కోట్ల బకాయిల వసూలు కోసం ఆ కంపెనీని విక్రయించాలని నిర్ణయించింది. ఆస్తుల పునర్ వ్యవస్థీకరణ కంపెనీలు (ఏఆర్సీ), బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఆర్థిక సంస్థలు ఈ ఆస్తుల కోసం పోటీపడవచ్చని తెలిపింది. వచ్చే నెల 4వ తేదీన వేలం ద్వారా ఆంధ్రా ఫెర్రో అల్లాయ్స్ ఆస్తులు ‘స్విస్ ఛాలెంజ్’ పద్దతిలో వికయ్రించనున్నట్టు తెలిపింది. ఆంధ్రా ఫెర్రో అల్లాయ్స్‌తో పాటు మరో ఐదు కంపెనీలను ఎస్బీఐ ఈ వేలం ద్వారా విక్రయించనుంది. పాట్నా భక్తతియార్పూర్ టోల్‌వే, స్టీల్‌కో గుజరాత్ లిమిటెడ్, జీఓఎల్ ఆఫ్‌షోర్ లిమిటెడ్, గురు ఆషిష్ ట్యాక్స్ ఫ్యాబ్, గెనిక్స్ ఆటోమెబైల్ కంపెనీలు వీటిలో ఉన్నాయి. ఈ ఆరు కంపెనీల నుంచి ఎస్బీఐకి మొత్తం రూ.406 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది.