NSE కేసు: ఆనంద్ అరెస్ట్
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆపీసర్ ఆనంద్ సుబ్రమణ్యంను సీబీఐ అధికారులు ఇవాళ అరెస్ట్ చేశారు. స్టాక్ ఎక్స్ఛేంజీ సర్వర్ ఆర్కిటెక్చర్ స్కామ్‌లో అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్ఎస్ఈ భవనంలోని సర్వర్‌ను షేర్ మార్కెట్ బ్రోకర్లకు యాక్సెస్ ఇచ్చే ముందు ఓ ప్రైవేట్ కంపెనీకి సర్వర్ నుంచి డేటాను ఇచ్చారనే ఆరోపణలపై 2018లో కేసు నమోదు అయింది. ఆనంద్ సుబ్రమణ్యంతో పాటు నాటి సీఈఓ చిత్ర సుబ్రమణ్యంపై సెబి ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా హియాలయాల్లోకి ఓ బాబా ఆదేశం మేరకు ఆనంద్ సుబ్రమణ్యంను చిత్ర నియమించారు. పైగా అతనికి నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్లు కూడా ఇచ్చారు.