For Money

Business News

ఎల్లుండి ఆమి ఆర్గానిక్స్‌ IPO

సూరత్‌కు చెందిన ఆమి ఆర్గానిక్స్‌ కంపెనీ బప్లిక్‌ ఆఫర్‌ ఎల్లుండి అంటే సెప్టెంబర్‌ 1న ప్రారంభం కానుంది. విజయా డయాగ్నస్టిక్స్‌తో పాటు ఈ ఇష్యూ ప్రారంభం కానుంది. 450కి పైగా ఫార్మా ఇంటర్మీడియట్స్‌ను తయారు చేసే ఆమి ఆర్గానిక్స్‌ మార్కెట్‌ నుంచి రూ. 569 కోట్లను సమీకరించదలిచింది.ఈ ఇష్యూ ధర శ్రేణి రూ. 603 నుంచి రూ. 610 ఉంటుంది. ఇష్యూ 3వ తేదీన క్లోజవుతుంది. 14వ తేదీన లిస్టయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కనీసం 24 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే గరిష్ఠ ధర వద్ద ఇన్వెస్టర్లు దరఖాస్తు చేయాలంటే రూ. 14,640 చెల్లించాల్సి ఉంటుంది. ఆపైన 24 గుణకాలలో దరఖాస్తు చేయొచ్చు. గరిష్ఠంగా 13 లాట్లకు దరఖాస్తు చేయొచ్చు. గరిష్ఠ దరఖాస్తు మొత్తం రూ. 1,90,320 అవుతుంది. మొత్తం ఇష్యూలో రీటైల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం షేర్లను కేటాయించారు. ఈ ఇష్యూ లాభాల్లో లిస్టయ్యే అవకాశాలు ఉన్నాయి.