ఫ్యూచర్‌పై అమెజాన్ క్రిమినల్ కేసు?
ఒకవైపు తమ మధ్య వివాదం నడుస్తుండగా… స్టోర్లను రిలయన్స్ రీటైల్‌కు ఫ్యూచర్ గ్రూప్ బదిలీ చేయడంపై అమెజాన్ ఆగ్రహంతో ఉంది. ఫ్యూచర్‌పై క్రిమినల్ కేసు పెట్టాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్యూచర్ గ్రూప్‌ను తన ఆస్తులను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రూ. 24,000 కోట్లకు విక్రయించిన విషయం తెలిసిందే. అప్పటికే ఫ్యూచర్స్‌లో పెట్టుబడిన అమెజాన్… ఈ డీల్‌ను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు నడుస్తోండగానే తన స్టోర్స్‌ను ఫ్యూచర్స్ కంపెనీ రిలయన్స్ రీటైల్‌కు బదిలీ చేసింది. అనేక చోట్ల మాల్స్, స్టోర్ భవన యజమానులతో అద్దె ఒప్పందాలు పూర్తయ్యాయని, వాటిని తిరిగి రెన్యూవల్ చేసుకునే ఆర్థిక స్థోమత తనకు లేదని ఫ్యూచర్ అంటోంది. అయితే ఈ విషయం తమ దృష్టికి తీసుకురాకుండా ఆస్తులను బదిలీ చేయడంపై అమెజాన్ కంపెనీ ఈవారంలోనే కోర్టును ఆశ్రయించవచ్చని తెలుస్తోంది.