ఇక అమెజాన్ ప్రైమ్‌లో యాడ్స్

ఇప్పటి వరకు యాడ్స్ లేకుండా సినిమాలు, సిరీస్ చూసిన ప్రేక్షకులకు … ఇక నుంచి యాడ్స్ బెడద తప్పదు అమెజాన్ ప్రైమ్‌లో. జూన్ 17వ తేఈ నుంచి తమ కార్యక్రమాల్లో యాడ్స్ ఉంటాయని ఇవాళ అమెజాన్ ప్రకటించింది. అయితే టీవీ ఛానల్స్‌లో మాదిరి కాకుండా… పరిమిత సంఖ్యలో యాడ్స్ ఉంటాయని పేర్కొంది. యాడ్స్ వొద్దనుకునేవారు నెలకు రూ. 129 లేదా ఏడాదికి రూ. 699 చెల్లించి యాడ్ ఫ్రీ యాడ్ ఆన్ ఆప్షన్‌ను పొందవచ్చని అమెజాన్ వెల్లడించింది.