For Money

Business News

అమెజాన్‌ పండుగ తేదీ వచ్చేసింది

అమెజాన్‌ వార్షిక సేల్‌ ఈనెలలో వచ్చేస్తోంది. ఈనెల 27వ తేదీన గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ను అమెజాన్‌ నిర్వహించనుంది. ప్రైమ్‌ మెంబర్లకు మాత్రం 24 గంటల ముందే ఈ సేల్‌ అందుబాటులోకి వస్తుంది. మరో ఈకామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కూడా ఈనెల 27 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ డేస్‌ సేల్‌ నిర్వహిస్తోంది. అమెజాన్‌ సేల్‌లో ఎస్‌బీఐ కార్డు వాడేవారికి పది శాతం డిస్కౌంట్‌ లభించనుంది. క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్ కార్డుతో చేసే కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్‌ ఉంటుందని అమెజాన్‌ పేర్కొంది. అలాగే తమ సొంత సంస్థ అమెజాన్‌ పే యూపీఐతో చేసే రూ.1000పైన కొనుగోళ్లపై రూ.100 డిస్కౌంట్‌ అందించనున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో మొబైల్స్‌పై 40 శాతం, ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం, హోమ్‌ అప్లయన్సస్‌పై 50 శాతం, ఫ్యాషన్‌ ఉత్పత్తులపై 50-80 శాతం వరకు డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లతో పాటు కూపన్లను అమెజాన్‌ జారీ చేయనుంది.