For Money

Business News

షేర్ల విభజన: ఒక షేరుకు 20 షేర్లు

దాదాపు 23 ఏళ్ళ తరవాత అమెజాన్‌ కంపెనీ తన షేర్లను విభజించాలని నిర్ణయించింది. వాటాదారుల దగ్గర ఉన్న ప్రతి ఒక షేరుకు 19 అదనపు షేర్లు ఇవ్వాలని నిర్ణయించింది. షేర్ల విభజన తరవాత కొత్త షేర్లు జూన్‌ 6వ తేదీ నుంచి ట్రేడ్‌ అవుతాయి. షేర్ల విభజనతోపాటు 1000 కోట్ల డాలర్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేయాలని కూడా కంపెనీ ప్రకటించింది. దీంతో ట్రేడింగ్‌ ముగిసిన తరవాత అమెజాన్‌ షేర్‌ ఏడు శాతం లాభంతో ట్రేడవుతోంది.గత నెలలో గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ తన షేర్లను ఇలాగే విభజించింది. 2020 తరవాత యాపిల్‌, టెస్లా కంపెనీలు కూడా తమ షేర్లను విభజించాయి. నిన్న రాత్రి అమెజాన్‌ షేర్‌ 2785.58 వద్ద ముగిసింది. గత రెండేళ్ళలో ఈ షేర్‌ రెట్టింపు అయింది. 2016 తరవాత కంపెనీ షేర్లను బైబ్యాక్‌ చేస్తోంది.