For Money

Business News

అమర రాజా లాభాలు డౌన్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.145.30 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని అమర రాజా బ్యాటరీస్‌ వెల్లడించింది. 2020 మూడో త్రైమాసికంలో కంపెనీ ప్రకటించిన రూ.193.69 కోట్ల లాభంతో పోలిస్తే 25.25 శాతం తగ్గింది. త్రైమాసికంలో మొత్తం ఆదాయం మాత్రం రూ.1,995.63 కోట్ల నుంచి రూ.2,384.82 కోట్లకు పెరిగింది. అదే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గడిచిన 9 నెలల వరకు చూస్తే… అమరరాజా బ్యాటరీస్‌ రూ.6,578.20 కోట్ల ఆదాయంపై రూ.413.72 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.