For Money

Business News

ఒక శాతంపైగా నష్టాలు

నిలకడగా ప్రారంభమైన వాల్‌స్ట్రీట్‌ క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. ఫ్యాక్టరీ డేటా చాలా పాజిటివ్‌గా రావడంతో … మళ్ళీ వడ్డీ రేట్ల భయం మార్కెట్లను పట్టుకుంది. దీంతో పదేళ్ళ ట్రెజరీ ఈల్డ్స్‌ మూడు శాతం పెరగ్గా, డాలర్ ఇండెక్స్‌ 102ను దాటింది. అమెరికకన్‌ ఎకనామి చాలా బలంగా ఉందంటూ వస్తున్న ప్రతి డేటా మార్కెట్‌ను దెబ్బతీస్తోంది. మూడు ప్రధాన సూచీలు ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. అంతకుముందు యూరప్‌ మార్కెట్లు కూడా నష్టాల్లోముగిశాయి. అన్ని సూచీలు దాదాపు అరశాతం నుంచి ఒక శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు క్రూడ్‌ ఆయిల్ మళ్ళీ 117 డాలర్లను దాటింది. బులియన్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి.