ఎయిర్టెల్ కనీస చార్జి రూ.155
భారతీ ఎయిర్టెల్ కంపెనీ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. కనీస నెలసరి రీచార్జ్ ధరను ఏకంగా 57 శాతం పెంచింది. దీంతో ఇక నుంచి 28 రోజుల మొబైల్ ఫోన్ సర్వీస్ ప్లాన్ ధర రూ.155కు పెంచింది. ఆంధ్రప్రదేశ్ (తెలంగాణతో కలిపి), కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్ పశ్చిమ, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, ఈశాన్య రాష్ర్టాల్లో ధరలు పెరిగాయి. రూ.99 ప్లాన్‌లో 200 మెగాబైట్ డాటా, కాల్స్ చార్జీ సెకనుకు 2.5 పైసలు ఉండేది. అయితే దీని ధరను ఇప్పుడు రూ.155కు పెంచారు. కస్టమర్లకు అపరిమిత కాల్స్, 1 జీబీ డాటా, 300 ఎస్ఎంఎస్లను అందిస్తున్నది.